: శాసనసభా పక్ష నేతగా జయలలిత ఎన్నిక... పన్నీరు సెల్వం రాజీనామా!


తమిళనాడు గవర్నరు కొణిజేటి రోశయ్య వద్దకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బయలుదేరారు. ఈ ఉదయం అన్నా డీఎంకే పార్టీ శాసనసభా పక్ష సమావేశం చెన్నైలో జరుగగా, శాసనసభా పక్ష నేతగా జయలలితను పార్టీ శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిమిషాల వ్యవధిలో ఈ సమావేశం ముగిసింది. ఆ వెంటనే పన్నీరు సెల్వం గవర్నరును కలిసేందుకు కదిలారు. ఆయన తన రాజీనామాను రోశయ్యకు ఇవ్వనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం జయలలిత కూడా రోశయ్యను కలవనున్నారు. తనను నేతగా ఎన్నుకున్న విషయాన్ని ఆయనకు లాంఛనంగా చెప్పనున్నారు. రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు వారం క్రితమే రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News