: ఇక అర్ధరాత్రి వరకూ హోటళ్లు, రెస్టారెంట్లు... టీ-సర్కారు అనుమతి
తెలంగాణ రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు ఇకపై ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సేవలందించనున్నాయి. ఈ మేరకు కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అవకాశం కల్పించింది. తాము రాత్రిపూట 12 గంటల వరకూ వ్యాపారాలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని చానాళ్లుగా హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చించిన తెలంగాణ మంత్రివర్గం సానుకూలంగా స్పందిస్తూ, రాత్రి పూట రెస్టారెంట్లు, హోటళ్లను తెరచివుంచేందుకు అనుమతించింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి హర్ ప్రీత్ సింగ్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.