: ఆ ముఖ్య ఘట్టాలపై 'నో ప్రాబ్లం': అజ్జూ


భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజహరుద్దీన్ తన జీవితమే ఇతివృత్తంగా తెరకెక్కుతున్న 'అజహర్' చిత్రంపై స్పందించారు. తన పెళ్లి, మ్యాచ్ ఫిక్సింగ్ అంశాలను ఈ సినిమాలో పొందుపరిచారని, సినిమాలో ఆ ఘట్టాలను చూపడంపై తనకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సినిమా స్క్రిప్టు చదివానని తెలిపారు. ఆంథోనీ డిసౌజా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అజ్జూ భాయ్ పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషించాడు. బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఏక్తా కపూర్ నిర్మిస్తోంది. క్రికెట్ కెరీర్ లో అజ్జూపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలు, బాలీవుడ్ నటి సంగీతా బిజ్ లానీతో ప్రేమాయణం, పెళ్లి వంటి అంశాలను ఈ సినిమాలో ఎలా చూపుతారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News