: ఒక్కడు... మూడు బ్యాంకు ఉద్యోగాలు కొట్టాడు!


ప్రస్తుత కాలంలో ఒక్క ఉద్యోగం సంపాదించడానికే యువత అష్టకష్టాలు పడుతుంటే, సాంబశివ అనే యువకుడు ఏకంగా మూడు బ్యాంకుల్లో ఉద్యోగాలు సంపాదించాడు. వివరాల్లోకెళితే... అనంతపురం పోలీస్ వెల్ఫేర్ కాంప్లెక్స్ లో చెత్త ఊడ్చే దంపతుల కుమారుడే సాంబశివ. వారు రెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. సాంబశివ, అతని అక్కను వారు ఎంతో కష్టపడి చదివించారు. సాంబశివ పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం సాగించాడు. టెన్త్ క్లాస్ లో 547 మార్కులు సంపాదించుకున్న ఈ మణిపూస ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ పూర్తి చేశాడు. అయితే, ఉన్నత చదువులు చదవాలన్న అతని ఆశయాన్ని పేదరికం అడ్డుకుంది. దాంతో, పై చదువు కోరికను అటకెక్కించి, బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యాడు. ఆకలి విలువ తెలిసిన అతడు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్న లక్ష్యంతో పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. కష్టం ఫలించడంతో మూడు బ్యాంకుల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఆంధ్రా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఎస్ బీహెచ్ అతడి ప్రతిభను మెచ్చాయి. అయితే, ఎస్ బీహెచ్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ గా చేరాలని భావిస్తున్నట్టు సాంబశివ మీడియాకు తెలిపాడు. ప్రస్తుతం ఓ ఇల్లు నిర్మించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News