: 11 రోజుల తరువాత మంత్రి కుమార్తె మృతదేహం లభ్యం
మీరట్ లోని మెడికల్ కళాశాలలో చదువుతూ, సాహస యాత్ర కోసం రుషికేశ్ లోని గంగానదిలో రబ్బరు పడవలో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కొట్టుకుపోయిన ఉత్తరప్రదేశ్ మంత్రి షాహిద్ మంజూర్ కుమార్తె అబిదా హసన్ (24) మృతదేహం లభ్యమైంది. ఆమె గంగానదిలో కొట్టుకుపోయిన 11 రోజుల తరువాత కుళ్లిపోయిన స్థితిలో పశులాక్ బ్యారేజీ సమీపంలో మృతదేహం లభించింది. దీంతో 11 రోజులుగా గాలింపు చేపట్టిన సహాయక బృందాలు ఆమె మృతదేహాన్ని పాయురీ ఎస్పీకి అప్పగించాయి.