: రాష్ట్ర పరీక్షకు 'నో ఎంట్రీ' అన్నారు...జాతీయ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది!


ఒక్క నిమిషం నిబంధన కారణంగా పీజీ లా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తన కుమార్తె గాలి పరివర్తనను పరీక్షకు అనుమతించని సంగతి తెలిసిందే. అలా రాష్ట్ర స్థాయి లా పరీక్షకు హాజరుకాలేకపోయిన పరివర్తన, లక్నోలోని రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ నిర్వహించిన జాతీయ 'క్లాట్' (కామన్ లా అడ్మిషన్ టెస్ట్) ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో జనరల్ కేటగిరీలో 8వ ర్యాంకు సాధించిన ఈ అమ్మాయి, ఎస్సీ విభాగంలో ఫస్ట్ ర్యాంకులో నిలవడం విశేషం. దీంతో ఆమెకు నల్సార్ యూనివర్సిటీలో సీటు లభించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News