: రాజధాని నిర్మాణంపై నాకో డౌట్ వస్తోంది: సినీ నటుడు శివాజీ


సినీ నటుడు శివాజీ మరోమారు మీడియా ముందుకు వచ్చారు. తనకో సందేహం వస్తోందని, నిధులు లేకుండా ఇప్పటికిప్పుడు రాజధాని నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏమిటన్న సందేహం కలుగుతోందని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేసేందుకే హడావుడిగా రాజధాని నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. కేంద్రం రాజధాని నిర్మాణానికి రూ.1000 కోట్లు ఇస్తామంటోందని, ఆ డబ్బుతో ఏం చేయగలరని ప్రశ్నించారు. ఏ మూలకు వస్తాయి ఆ నిధులు? అని అడిగారు. ఏపీ అంటే ఆర్థిక సంఘానికి అలుసైపోయిందని మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం తన దృష్టిలో ఓ చెత్త సంఘం అని విమర్శించారు. ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలపై వీడియోను యూట్యూబ్ లో పెడుతున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News