: భార్యతో కలిసి రియాలిటీ షోలో డ్యాన్స్ చేయనున్న టీమిండియా ఓపెనర్


టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తన భార్య ఆయేషాతో కలిసి ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొంటున్నాడు. స్టార్ ప్లస్ చానెల్ లో వచ్చే 'నాచ్ బలియే 7' రియాలిటీ షోలో ధావన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మేరకు నిర్వాహకులు ధావన్, ఆయేషాలను సంప్రదించగా, వారు అందుకు సమ్మతించారు. ఈ రియాలిటీ షోను ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. న్యాయనిర్ణేతలుగా బాలీవుడ్ నటి ప్రీతీ జింతా, సుప్రసిద్ధ రచయిత చేతన్ భగత్, కొరియోగ్రాఫర్ పెస్తోంజీ వ్యవహరిస్తారు. కాగా, ధావన్ దంపతులు తమ కార్యక్రమంలో పాల్గొంటే, అదనపు ఆకర్షణ అవుతుందని నిర్వాహకులు అంటున్నారు.

  • Loading...

More Telugu News