: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, బ్యాంకింగ్, పవర్ స్టాక్స్ కొంతమేర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 28 పాయింట్లు నష్టపోయి 27,809 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 2 పాయింట్లు కోల్పోయి 8,421 వద్ద ముగిసింది. ఇవాల్టి టాప్ గెయినర్స్ లో స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్, బజాజ్ ఆటో లిమిటెడ్, ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా), పుంజ్ లాయిడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ లు ఉన్నాయి. ఏఐఏ ఇంజినీరింగ్, టాటా స్టీల్, భారతీ ఇన్ ఫ్రా టెల్, పిడిలైట్ ఇండస్ట్రీస్, ఎన్ సీసీ కంపెనీలు టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి.