: సీలింగ్ కు కొండచిలువ...ఇంటి యజమాని పరుగో పరుగు


జూలో కొండ చిలువను చూడాలంటేనే భయం, అలాంటిది ఇంట్లో సీలింగ్ కు కొండచిలువ వేలాడుతూ కనిపిస్తే ఇంకేమైనా ఉందా? అలాంటి సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. జల్ పాయ్ గురి జిల్లాలోని ఓ ఇంట్లోని సీలింగ్ కు కొండ చిలువ వేలాడుతూ కనిపించింది. దానిని చూసిన కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగుతీశారు. తలుపులన్నీ మూసేసి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి వచ్చే లోపే స్థానికంగా పాములు పట్టేవారు వచ్చి, కొండచిలువను ఒడిసి పట్టుకుని, అటవీశాఖాధికారులకు అప్పగించారు. వారు దానిని సమీపంలోని కుటుమారీ అడవిలో వదిలిపెట్టారు.

  • Loading...

More Telugu News