: జాగ్రత్త సుమీ... రేపు, ఎల్లుండి ఎండలు మరింత మండుతాయట!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణీ కార్తె రాకమందే భానుడు భగభగలతో చెమటపట్టిస్తున్నాడు. పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా ఉదయం పదకొండు తరువాత బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. రామగుండంలో ఈ రోజు 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరగనున్న ఉష్ణోగ్రతల కారణంగా వడగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు బయటకు వెళ్లకుండా, ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఆయన సూచించారు.