: సినీ పరిశ్రమను టార్గెట్ చేసిన కోదండరామ్


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... కనుమరుగైన టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఈమధ్య అప్పుడప్పుడు వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా మళ్లీ తనదైన వాయిస్ తో వార్తల్లో నిలిచారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలుండగా... ప్రస్తుతం ఆయన తెలుగు సినీ పరిశ్రమను టార్గెట్ చేశారు. కొందరు జేఏసీ నేతలతో కలసి వెళ్లిన ఆయన టీఎస్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ, సినీ పరిశ్రమ మూడు, నాలుగు కుటుంబాల చేతుల్లోనే ఉందని... థియేటర్లపై గుత్తాధిపత్యం కూడా వారిదేనని ఆరోపించారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ను గుర్తించాలని... థియేటర్లలో శ్లాబ్ పద్ధతిని తొలగించి, టికెట్ల ఆధారంగా పన్ను వసూలు చేయాలని డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమలో అందరికీ సమాన అవకాశాలు ఉండేలా చూడాలని మంత్రిని కోరారు.

  • Loading...

More Telugu News