: 'ఎల్జీ' నచ్చకపోతే 'సామ్ సంగ్', 'సోనీ' చూసుకోవచ్చుగా?: నెటిజన్ల సెటైర్లు


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్ మధ్య విభేదాలు సోషల్ మీడియాలో పతాక శీర్షికలకెక్కాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య పోరు మహారంజుగా సాగుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 'ఎల్జీ' నచ్చకుంటే 'సామ్ సంగ్'నో, 'సోనీ'నో తెచ్చుకోవచ్చుగా, 'ఎల్జీ'తోనే ఎందుకు వేగడం? అని మరి కొందరు సెటైర్లు వేస్తున్నారు. వీరి మధ్య రేగిన వివాదం అధికారుల పాలిట 'పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం'లా తయారైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో నేటి రాజకీయ చర్చ మొత్తం వీరి చుట్టూ తిరగడం విశేషం.

  • Loading...

More Telugu News