: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నైతికతతో వ్యవహరించాలి: ఎర్రబెల్లి
జూన్ 1న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నైతికతతో వ్యవహరించాలని టి.టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అసలు ఎన్నిక అవసరం లేకుండానే ఏకగ్రీవానికి అవకాశం ఉందని, అలాంటప్పుడు అనవసరంగా పోటీకి దింపి, తెలంగాణలో కొత్త ఒరవడి తీసుకురావద్దని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ చేర్చుకుందని, తామూ నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి రప్పించుకోగలమని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంఖ్యాబలం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న టి.టిడిపి అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి అన్నారు. ఉన్న 16 మందితోనైనా విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.