: ఇతర పార్టీలు మాకే ఓటేస్తాయి: కడియం
తెలంగాణలోని ఇతర పార్టీలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకే ఓటేస్తాయని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇతర పార్టీలతో బేరసారాలు చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. పలు పార్టీల నేతలు తమతో చేరేందుకు, తమకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అందుకే తాము ఐదుగురు అభ్యర్ధులను బరిలో దించామని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన వారం రోజుల్లో తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, యాదవ రెడ్డి, నేతి విద్యాసాగర్, బి.వెంకటేశ్వర్లును ప్రకటించింది. ఐదో అభ్యర్ధిని ఇతరపార్టీలు గెలిపిస్తాయని శ్రీహరి వ్యాఖ్యానించడం విశేషం.