: భారత్ విపత్తు నిర్వహణ సామర్థ్యాన్ని కొనియాడిన అమెరికా


నేపాల్ లో భూకంపం సంభవించిన వెంటనే భారత్ స్పందించిన తీరును అమెరికా ప్రస్తుతించింది. భేష్ అంటూ భారత్ విపత్తు నిర్వహణ సామర్థ్యానికి కితాబిచ్చింది. భారతదేశంలో అనుసరిస్తున్న విపత్తు నిర్వహణ విధానాలు అత్యాధునికమైనవని పేర్కొంది. నేపాల్ పట్ల పొరుగుదేశాలు ఎన్నదగిన స్పందన చూపాయని, ముఖ్యంగా, భారత ప్రభుత్వం, సైన్యం అద్భుతంగా వ్యవహరించాయని కొనియాడింది. ఇటీవల కాలంలో ఒడిశాను అతలాకుతలం చేసిన తుపాను సందర్భంగా భారత్ స్పందించిన తీరు వారి విపత్తు నిర్వహణ సామర్థ్యానికి అద్భుత నిదర్శనమని తెలిపింది. కేటగిరీ 5 సూపర్ సైక్లోన్ సంభవించినా, మరణాలు అతి తక్కువగా నమోదయ్యాయని అమెరికా పేర్కొంది.

  • Loading...

More Telugu News