: 'లేడీ రజనీ ఆఫ్ ముంబై' అంటూ హీరోయిన్ ను పొగడ్తల్లో ముంచెత్తిన దర్శకుడు
'లేడీ రజనీ ఆఫ్ ముంబై' అంటూ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను తమిళ దర్శకుడు మురుగదాస్ ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు. తమిళంలో సూపర్ హిట్టయిన 'మౌన గురు' సినిమాను 'అకీరా' పేరిట మురుగదాస్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తండ్రీ కూతుళ్లయిన శతృఘ్న సిన్హా, సోనాక్షి కలిసి తొలిసారి నటిస్తుండడం విశేషం. అకీరా సినిమాలో సోనాక్షి నటనకు మురుగదాస్ అభిమానిగా మారాడు. ఆమె డైలాగ్ డెలివరీకి ఫిదా అయిపోయిన ఆయన, అద్భుతంగా నటిస్తోందంటూ, తేవర్ సినిమాలో సోనాక్షి నటించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మొత్తానికి సోనాక్షి సిన్హా తమిళ దర్శకులను భలే ఆకట్టుకుంటోందంటూ బాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. గతంలో ప్రభుదేవా కూడా ఆమెపై ఇలాంటి ప్రశంసలే కురిపించిన సంగతి తెలిసిందే.