: మోదీ పనితీరుపై అన్ని అంచనాలెందుకు: ఆర్బీఐ గవర్నర్ రాజన్ సంచలన వ్యాఖ్య


ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుపై అవాస్తవిక అంచనాలను ప్రజలు, కార్పొరేట్లు పెంచుకున్నారని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. అయితే, పెట్టుబడుల వాతావరణం మెరుగుపడేలా అడుగులు పడుతున్నాయని ఆయన అన్నారు. న్యూయార్క్ పర్యటనలో ఉన్న ఆయన ఎకనామిక్ క్లబ్ లో ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం మోదీ కొత్త ప్రభుత్వాన్ని స్థాపించిన తరువాత ఆర్థిక వ్యవస్థపై అంచనాలు పెరిగిపోయాయని, 'రోనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ప్రజలకు ఎన్ని అంచనాలున్నాయో అన్ని అంచనాలను భారతీయులు మోదీపై పెట్టుకున్నారు' అని ఆయన అన్నారు. ఆ తరహా అంచనాలు సరైనవి కావని వివరించారు. సున్నితాంశాలపై ఇన్వెస్టర్ల మనోభావాలు దెబ్బతినకుండా ముందడుగు వేయడం కష్టమని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సమయంలో రాజన్ ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News