: భద్రాచలం వద్ద గోదావరిలోకి బోల్తా కొట్టిన బస్సు... ఇద్దరి మృతి, పలువురి పరిస్థితి విషమం


భద్రాచలం వద్ద ఉన్న గోదావరి నదిలోకి ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఖమ్మం నుంచి వస్తున్న 'రామబాణం' బస్సు... గోదావరి బ్రిడ్జిపైకి వెళుతున్న సమయంలో ఎడమవైపున నదిలోకి పడింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 30 మందికి గాయాలైనట్టు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ చనిపోయింది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు భద్రాచలం డిపోకు చెందినది. ఈ బస్సు రిజిస్ట్రేషన్ నెంబర్ ఏపీ 20 3940.

  • Loading...

More Telugu News