: ఎన్టీఆర్ కు నివాళులర్పించి... నామినేషన్ లు వేసిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు టీడీపీ, బీజేపీ అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేశారు. ముందుగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంఏ.షరీఫ్, ప్రతిభా భారతిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సమయంలో పలువురు టీడీపీ నేతలు వారి వెంట ఉన్నారు. అటు బీజేపీ నేత సొము వీర్రాజు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.