: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేజ్రీవాల్ వివాదాలు సృష్టిస్తున్నారు: వెంకయ్య
సొంత ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. వివాదాలకు బదులుగా ముందు తన ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టాలని ఓ ఆంగ్ల చానల్ ఇంటర్వ్యూలో సూచించారు. అంతేగాక ఢిల్లీ పాలనను కేంద్రం హైజాక్ చేయాలని ప్రయత్నిస్తోందంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను వెంకయ్య తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ సీఎం బాధ్యతలు, విధులలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని, అటు గవర్నర్ కూడా ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారని పేర్కొన్నారు.