: కుమార్తెను కేంద్ర మంత్రిని చేయాలని కేసీఆర్ ఆరాటపడుతున్నారు: జీవన్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వంలో చేరే విషయంపై టీఆర్ఎస్ పావులు కదపడంపై సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి స్పందించారు. తన కుమార్తె, ఎంపీ కవితను కేంద్రమంత్రిని చేసేందుకు సీఎం కేసీఆర్ ఆరాటపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకోసం బీజేపీ మెప్పు పొందేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కరవు పరిస్థితులతో వందలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానన్న కేసీఆర్ సంవత్సర పాలనలో తెలంగాణలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు పట్టిన సైతాన్ అని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.