: 400 ఏళ్ల నాటి బోటనీ పుస్తకంలో లభించిన షేక్స్ పియర్ అసలు చిత్రం
రోమియో అండ్ జూలియట్, ది మర్చంట్ ఆఫ్ వెనిస్, హామ్లెట్ వంటి అద్భుత రచనలను ప్రపంచానికి అందించిన ప్రఖ్యాత రచయిత విలియమ్ షేక్స్ పియర్ అసలు చిత్రం తొలిసారిగా లభించింది. సుమారు 400 సంవత్సరాల నాటి ఓ బోటనీ పుస్తకంలో ఆయన చిత్రం ఉందని, ఇదే తన జీవితకాలంలో ఆయన గీయించుకున్న ఏకైక చిత్రమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1545 నుంచి 1612 మధ్య కాలంలో జీవించిన బోటనిస్టు జాన్ గెరార్డ్ జీవితంపై బ్రిటీష్ శాస్త్రవేత్త, చరిత్రకారుడు మార్క్ గ్రిఫిత్స్ పరిశోధనలు సాగిస్తుండగా, షేక్స్ పియర్ చిత్రం లభించినట్టు బీబీసీ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 1598లో పబ్లిష్ అయిన 1,484 పేజీల పుస్తకంలో ఆయన చిత్రం ఉందని జాన్ గెరార్డ్ వివరించారు. ప్రపంచంలో వృక్ష జాతులపై పబ్లిష్ అయిన అతిపెద్ద సింగల్ వాల్యూమ్ పుస్తకం ఇదేనని ఆయన వివరించారు.