: శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం, దర్శకేంద్రుడు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ముందుగా డిప్యూటీ సీఎం చినరాజప్ప విఐపీ విరామ సమయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సమయంలో స్వామికి ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సినీ దర్శకులు రాఘవేంద్రరావు, శ్రీకాంత్ అడ్డాల, సంగీత దర్శకుడు మణిశర్మలు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు భక్తుల తాకిడితో ఈరోజు శ్రీవారి దర్శనానికి మరింత సమయం పడుతోంది.