: కంటతడి పెట్టిన కరుణానిధి


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి కంటతడిపెట్టారు. వివరాల్లోకి వెళ్తే, ఆయన సోదరి షణ్ముగ సుందరత్తమ్మాల్ (99) కన్నుమూశారు. తన సోదరి ఇక లేదన్న ఆవేదనలో ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సన్నివేశం చుట్టుపక్కల ఉన్న వారిని కలచివేసింది. దీంతో, పక్కనే ఉన్న ఆయన కుమారుడు స్టాలిన్, పీఎంకే అధినేత రాందాస్, కేంద్ర మాజీ మంత్రి రాజా, ఇతర నేతలు కరుణను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ రోజు సుందరత్తమ్మాల్ భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు ఇద్దరు అక్కయ్యలు ఉండగా... పెద్ద అక్క పెరియ నాయకి ఇంతకు ముందే కాలం చేశారు.

  • Loading...

More Telugu News