: తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో పోటీచేసే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, కె.యాదవరెడ్డి, నేతి విద్యాసాగర్, బి.వెంకటేశ్వర్లు పేర్లను ఖరారు చేశారు. ఈ ఉదయం 11 గంటలకు వారంతా నామినేషన్ లు దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. జూన్ 1న తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.