: చావుబతుకుల మధ్య ఉంటే వీడియోలు తీస్తారా?: విరుచుకుపడ్డ శిఖా శర్మ సోదరుడు


ఓ డాక్టర్, బాలీవుడ్ లో వివాహితులైన కొందరి వేధింపుల వల్ల జీవితంపై విరక్తి కలిగిందంటూ, ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన నటి శిఖా శర్మ చివరి వీడియోపై ఆమె సోదరుడు విరుచుకుపడ్డారు. గొంతు తెగి రక్తం కారుతున్న సమయంలో వీడియో తీసేందుకు ఉన్న ఆసక్తిలో కాస్తయినా శిఖాపై పెట్టి, ఆమె ప్రాణాలను కాపాడే ప్రయత్నం ఎందుకు చెయ్యలేదని ఆయన ప్రశ్నించారు. శిఖా స్నేహితురాలు మధు భారతి తక్షణం స్పందించి ఆసుపత్రికి తీసుకువెళ్లి వుంటే ఆమె బతికే అవకాశాలు మెరుగయ్యేవని అన్నారు. కాగా, ఆసుపత్రికి తరలించకుండా, తాపీగా ఇంటర్వ్యూ రికార్డు చేయడం వెనుక మధు ఆంతర్యమేమిటన్న విషయమై పోలీసులు ఇప్పటికే ఆమెను రెండుసార్లు ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News