: కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, సస్పెండ్ అయిన ఎమ్మార్వో


ఆర్ఐ, వీఆర్ వోలతో కలిసి కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఓ ఎమ్మార్వో అడ్డంగా దొరికిపోయాడు. గుంటూరు జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వీరు, స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించిన భూమిని నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయించేందుకు నకిలీ ఎన్‌వోసీ సృష్టించారు. ఒక భూమి వ్యవహారంలో తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఈ విషయంలో ఫిర్యాదులు అందుకున్న కలెక్టర్ కాంతిలాల్ దండే, విచారణ జరిపి ఆరోపణలు నిజమేనని తేల్చారు. దీంతో ప్రత్తిపాడు ఎమ్మార్వో ఏసుబాబుతో బాటు, రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్, నడింపల్లి వీఆర్‌ వోలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News