: దుబాయ్ వెళ్లాలి... అనుమతించండి: కోర్టుకు తెలిపిన సల్మాన్
ఈ నెలలో దుబాయిలో ఓ స్టేజ్ షోలో పాల్గొనాల్సి వున్నందున అందుకు అనుమతించాలని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కోర్టును అభ్యర్థించారు. 2002 నాటి 'హిట్ అండ్ రన్' కేసులో సల్మాన్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు సెషన్స్ కోర్టు ఐదేళ్ల శిక్షను విధించగా, దాన్ని బాంబే హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. కాగా, తాను దుబాయ్ పర్యటించేందుకు అనుమతించాలని సల్మాన్ కోరారు. ఈ నెల 29న స్టేజ్ షోలో పాల్గొనేందుకు సల్మాన్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకొని వున్నారు.