: సొంత లారీలతో 200 ఎర్రచందనం లోడ్ల స్మగ్లింగ్... అసలు దొంగ దొరికాడు!


పోలీసులు కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఎర్రచందనం అసలు దొంగ దొరికాడు. వివిధ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసిన సొంత లారీలతో సుమారు 200 ఎర్రచందనం లోడ్లను స్మగుల్ చేసినట్టు భావిస్తున్న నెల్లూరుకు చెందిన వేణుంబాకం సుదర్శన్ ను ఆత్మకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 40 లక్షల విలువైన దుంగలను, ఓ లారీనీ స్వాధీనం చేసుకున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో అక్రమంగా ఎర్రచందనం చెట్లను నరికించి తరలించడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు చెబుతున్నారు. అక్రమ రవాణాలో సుదర్శన్ ఆరితేరిన వాడని, సొంతంగా 15 లారీలను నిర్వహిస్తున్నాడని వివరించారు. సుదర్శన్ ను విచారిస్తే మరో 15 మంది పేర్లు వెల్లడయ్యాయట. వారికోసం అన్వేషణ ప్రారంభించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News