: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో భర్తీ కావాల్సిన ఎమ్మెల్సీ స్థానాలకు అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలుకు నేడే ఆఖరు రోజు కావడంతో, ఉదయం మరోసారి ఎమ్మెల్యేలతో సమావేశమై వీరి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేల కోటా కింద నాలుగు సీట్లు భర్తీకావాల్సి వుండగా, వైకాపాకు ఒకటి దక్కే అవకాశం ఉంది. మిగిలిన మూడు సీట్లలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి ఒక సీటు ఇచ్చిన బాబు మిగిలిన రెండు సీట్లకూ, ఎంఏ షరీఫ్‌ (పశ్చిమ గోదావరి), జూపూడి ప్రభాకరరావు (ప్రకాశం)లను ఎంచుకున్నారు. ఇక గవర్నర్‌ కోటా కింద నాలుగు సీట్లకు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి (నెల్లూరు), పంచుమర్తి అనురాధ (విజయవాడ), టీడీ జనార్దనరావు (కృష్ణా), గౌనివారి శ్రీనివాసులు (చిత్తూరు) పేర్లను దాదాపు ఖరారు చేసినట్టు తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News