: చెన్నైతో అమీతుమీకి సిద్ధమైన రాయల్ చాలెంజర్స్
లీగ్ దశలో అంతంతమాత్రమైన ఆటతీరుతో ప్లేఆఫ్ కు చేరుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అత్యంత కీలకమైన క్వాలిఫయర్-1 పోరులో సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పుణెలో జరిగిన మ్యాచ్ లో 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాత్రి జరిగిన పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలు పెట్టిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. 181 పరుగుల అసాధ్యం కాని విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు ఏ దశలోనూ విజయానికి దగ్గరగా సాగుతున్నట్టు కనిపించలేదు. ఓపెనర్ అజింక్య రహానే 42 పరుగులతో రాణించినప్పటికీ, మిగతా వారెవ్వరూ చెప్పుకోతగ్గ స్కోరును సాధించడంలో విఫలం కావడంతో 19 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోపక్క, ఫైనల్స్ లో స్థానం కోసం శుక్రవారం జరిగే క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో చెన్నైతో అమీతుమీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సిద్ధమైంది.