: మాజీ సీఎం కిరణ్ పై తెలంగాణ స్పీకర్ వ్యంగ్యం


తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వ్యంగ్యం ప్రదర్శించారు. ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారంలో మగ్గిపోతుందని వ్యాఖ్యానించారని, ఇప్పుడాయన వచ్చి తెలంగాణ ఎలా ఉందో పరిశీలించాలని అన్నారు. తెలంగాణ చీకటిమయం అవుతుందన్న ఆ పెద్దమనిషి ఇప్పుడు ఏ చీకట్లో ఉన్నారోనని వ్యంగ్యం ప్రదర్శించారు. ఆ పెద్ద మనిషి ఇప్పుడు ఆచూకీ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. హైదరాబాదులోని నల్లకుంటలో జరిగిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News