: నేపాల్ ప్రజలను వణికించిన తాజా ప్రకంపనలు
నేపాల్ లో భూ ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. బుధవారం ఉదయం, మధ్యాహ్నం భూమి కంపించడంతో నేపాల్ ప్రజలు వణికిపోయారు. తీవ్రత తక్కువే అయినా, గత అనుభవాలతో భీతిల్లిన ప్రజలు తాజా ప్రకంపనలతో హడలిపోయారు. ఉదయం వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదు కాగా, మధ్యాహ్నం వచ్చిన భూకంపం తీవ్రత 4.4గా నమోదైంది. ఖాట్మండూ, మకావన్ పూర్ మధ్యలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. గత నెలలో నేపాల్ లో సంభవించిన భూకంపం వేలాది మందిని బలిదీసుకున్న సంగతి తెలిసిందే.