: భారతీయుడ్ని పెళ్లాడతానంటున్న సౌదీ యువతి... కుదరదంటున్న తల్లిదండ్రులు!
మత విశ్వాసాలు బలంగా ఉండే సౌదీ అరేబియాలో ఓ యువతి భారతీయుడిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులతో చెప్పింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. రియాద్ లోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న భారతీయ యువకుడిని ఆ యువతి ప్రేమించింది. దీంతో ఆ కుటుంబ యజమాని తన కుమార్తెను మర్చిపోయి, తక్షణం దేశం విడిచి వెళ్లిపోవాలని యువకుడిని బెదిరించాడు. తాను దేశం విడిచి వెళ్లేది లేదని ఆ యువకుడు అతనికి స్పష్టం చేసినట్టు అక్కడి వార్తాపత్రికలు పేర్కొన్నాయి. కాగా, ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా అతడినే వివాహం చేసుకోవాలని ఆ యువతి పట్టుదలగా ఉందని ఆ పత్రికలు వెల్లడించాయి.