: ఆ నిబంధన చూసి నిర్ఘాంతపోయా: షబానా అజ్మీ
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడవాలంటే తప్పనిసరిగా హైహీల్స్ వేసుకోవాలన్న నిబంధన వార్తలు చూసి నిర్ఘాంతపోయానని ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ తెలిపారు. కేన్స్ చిత్రోత్సవాలకు పలు మార్లు హాజరైన తాను ఆ నిబంధన గురించి ఎప్పుడూ వినలేదని ఆమె అన్నారు. గతంలో హాలీవుడ్ నటి ఎమీలీ బ్లంట్ కూడా ఈ నిబంధనపై బహిరంగ విమర్శలు చేశారు. అప్పుడు కేన్స్ నిర్వాహకులు అలాంటి నిబంధన లేదని వివరణ ఇచ్చారు. కాగా, దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగింది.