: 'హై హీల్స్' వేసుకోలేదని ఆమెను రెడ్ కార్పెట్ పై నడవొద్దన్నారు!


కేన్స్ చిత్రోత్సవంలో ఓ మహిళ ఆత్మవిశ్వాసాన్ని నిర్వాహకులు దెబ్బతీశారు. కేవలం హైహీల్స్ వేసుకుని రాలేదన్న కారణంతో రెడ్ కార్పెట్ పై నడవవద్దని కోరారు. వాలేరియా రిక్టర్ అనే హాలీవుడ్ సినీ నిర్మాత కేన్స్ చిత్రోత్సవానికి హాజరయ్యారు. ఆమె కూడా మిగతా వాళ్లలా డిజైనర్ వేర్ లో అందర్నీ అలరించేలా డ్రెస్ చేసుకుని వచ్చారు. రెడ్ కార్పెట్ పై అందర్లానే హొయలు పోవాలని భావించి రెడ్ కార్పెట్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. అయితే, ఆమె ఫ్లాట్ చెప్పులు వేసుకున్న కారణంగా, ఆమెను రెడ్ కార్పెట్ పై నడవడానికి వీల్లేదని నిర్వాహకులు తెగేసి చెప్పారు. దీంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఆమెది హై హీల్స్ వేసుకోలేని స్థితి. వాలేరియా రిక్టర్ రెండు కాళ్లలో ఒకటి కృత్రిమ కాలు! దీంతో ఆమె హైహీల్స్ వాడలేరు. దీంతో ఇప్పుడు పలువురు ఆమెకు అండగా నిలిచి, నిర్వాహకుల తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News