: మోదీ కేవలం పది మంది పారిశ్రామిక వేత్తల కోసమే పనిచేస్తున్నారు: రాహుల్ గాంధీ
దేశవ్యాప్తంగా ఉన్న రైతులు భూములు కావాలని, పరిహారం కోసం భూములు వదులుకోలేమని రోదిస్తున్నా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అమేథీలో ఆయన మాట్లాడుతూ, మోదీ తన చుట్టూ ఉన్న పది మంది 'పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలే, దేశ ప్రయోజనాలు' అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 'పరిశ్రమలే భోజనం పెడతాయా? దేశ ప్రజల ఆహార అవసరాలు పారిశ్రామిక వేత్తలే తీరుస్తారా?' అనేది బీజేపీ నేతలు ప్రశ్నించుకోవాలని ఆయన సూచించారు. రైతు దేశానికి శక్తినిస్తాడని, విస్తారమైన ఆహార వనరులు ఆకలి చావులను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. మోదీ పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలే ముఖ్యమనే రీతిలో విదేశాల్లో వ్యవహరిస్తూ, దేశ ప్రజలను అగౌరవపరుస్తున్నారని రాహుల్ విమర్శించారు.