: అతని శక్తికి ఎదురులేదు... సత్తాకు పోలికే లేదు... ఆలోచనలకు అందడు!


బాహుబలి సినిమా ప్రచార పరంపరలో మరో పోస్టర్ విడుదలైంది. దర్శకుడు రాజమౌళి ఈసారి ప్రతినాయకుడు 'భల్లాలదేవ' పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'భల్లాలదేవ' పాత్రధారి రానా భారీ గదతో యుద్ధరంగంలో భీకరంగా దూసుకెళుతున్నట్టున్న ఆ చిత్రాన్ని పోస్టు చేసిన జక్కన్న దానికి ఓ క్యాప్షన్ కూడా పెట్టారు. అతని శక్తికి ఎదురులేదు, సత్తాకు పోలికే లేదు, ఆలోచనలకు అందడు... అంటూ 'భల్లాలదేవ'ను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News