: సునందా పుష్కర్ మృతి కేసులో నిజ నిర్ధారణ పరీక్షలకు కోర్టు ఓకే
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సతీమణి సునందా పుష్కర్ మృతి కేసులో వాస్తవాలను తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ పరీక్షలు అవసరమేనని ఢిల్లీ కోర్టు భావించింది. ఈ మేరకు శశిథరూర్ ఇంటి పనివారిపై పాలిగ్రాఫ్ టెస్ట్ జరిపేందుకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ)కు అనుమతిచ్చింది. అయితే, ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయాన్ని మాత్రం కోర్టు స్పష్టంగా వెల్లడించలేదు. సునంద మృతిపై పలు అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో కేసు విచారణను సిట్ కు అప్పగించగా, శశిథరూర్ పనివాళ్లు నరేన్ సింగ్, డ్రైవర్ బజ్ రంగీ, సన్నిహితుడు సంజయ్ దేవాన్ లు ఒక్కోసారి ఒక్కో విధమైన వాంగ్మూలాలు ఇచ్చారు. వీరు ఏవో నిజాలు దాస్తున్నారన్న అనుమానంతో వీరికి నిజ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ సిట్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.