: ఈ నెల 25 నుంచి ఏపీ రేషన్ డీలర్ల నిరవధిక సమ్మె
ఏపీలో నిరవధిక సమ్మె చేసేందుకు రేషన్ డీలర్లు సిద్ధమయ్యారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఈ నెల 25 నుంచి సమ్మె చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు విజయవాడ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. 24 వరకు ఈ దీక్షలు కొనసాగుతాయి. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తమకు వేతనాలు ఇవ్వాలని, డిపోల నుంచి చౌక దుకాణాల వరకు సరుకులను చేరవేయాలని, తూకం ప్రకారం అందివ్వాలని డీలర్లు డిమాండ్ చేశారు.