: వాళ్లిద్దరూ మాట్లాడుకుంటే పరిష్కారమైపోతుంది: రాజ్ నాథ్ సింగ్


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య తలెత్తిన వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. వారి మధ్య విభేదాలకు పరిష్కారం కనుగొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య నెల కొన్న విభేదాల కారణంగా మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయని, ఎవరి అధికారాలు ఏంటి? అన్నది వారికి సూచించాలని రాజ్ నాథ్ రాష్ట్రపతిని కోరారు. అనంతరం రాజ్ నాథ్ మీడియాతో మాట్లాడుతూ, అది పెద్ద సమస్యకాదని, విభేదాలు చర్చల ద్వారా సమసిపోతాయని, వారిద్దరూ కలిసి చర్చించుకుంటే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. మొత్తానికి కేజ్రీ, నజీబ్ జంగ్ మధ్య తలెత్తిన వివాదానికి పరిష్కారం లభించలేదు సరికదా, కథ మొదటికే వచ్చింది.

  • Loading...

More Telugu News