: కేసీఆర్...రా... నీకు భూములు చూపిస్తా: వీహెచ్
విశ్వవిద్యాలయాల భూములను పేదల ఇళ్లు కట్టించడానికి వినియోగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతోంది. పేదల ఇళ్ల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్ అవసరాల కోసం అవి అవసరమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల వందలాది ఎకరాల భూములు ఉన్నాయని, కావాలంటే వాటిని తీసుకుని పేదలకు ఇళ్లు కట్టించాలని ఆయన తెలంగాణ సర్కారుకు సూచించారు. ఆ భూములను చూపించేందుకు సిద్ధమని కూడా ఆయన చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించిందని, ప్రజల మద్దతుతో సర్కారు వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆయన చెప్పారు.