: తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరిగిన ఉష్ణోగ్రతలు


భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోయాయి. ఏపీలోని కృష్ణా జిల్లాలోని గన్నవరం, నందిగామలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణలోని నిజామాబాద్ లో అత్యధికంగా 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని నెల్లూరు, కావలిలో 43, ఒంగోలు, కర్నూలులో 42, తిరుపతిలో 41, తునిలో 40, బాపట్ల, మచిలీపట్నం, అనంతపురంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయవ్య దిశగా వీస్తున్న వేడిగాలుల వల్లే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News