: ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదు: కేసీఆర్


'స్వచ్ఛ హైదరాబాదు' ఒక్కరోజులో ముగిసే కార్యక్రమం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛ హైదరాబాదు నాలుగేళ్లపాటు జరుగుతుందని అన్నారు. ప్రభుత్వంతోపాటు ప్రతి ఒక్కరూ చెత్తపై సమరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. చెత్త సేకరించి పారబోసేందుకు ఆటో ట్రాలీలు కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు. రాజధానిలోని ప్రతి ఇంటికీ రెండు చెత్త బుట్టలు అందజేస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News