: అదృష్టమంటే మంగోలియాదే ... మహారాష్ట్ర ఏం పాపం చేసింది?: శివసేన


శివసేన పార్టీ ప్రధాని నరేంద్ర మోదీపై మరోమారు విమర్శలు గుప్పించింది. మంగోలియాకు ప్రధాని బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించడంపై తన 'సామ్నా' పత్రిక సంపాదకీయంలో దుయ్యబట్టింది. మంగోలియాపై ప్రదర్శించిన ఆసక్తిని, మోదీ కరవుతో విలవిల్లాడుతున్న మహారాష్ట్రపై ఎందుకు చూపలేకపోతున్నాడని ప్రశ్నించింది. "ప్రధాని మంగోలియాకు బిలియన్ డాలర్ల సాయం ప్రకటించారు. తద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయి. ఈ చిన్నదేశం పురోభివృద్ధికి ప్రధాని నైతిక బాధ్యత తీసుకున్నట్టుంది. అయితే, ఆయన ప్రకటించిందేమీ చిన్న మొత్తం కాదు. మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న రైతుల ఆత్మలను ఇది మరింత క్షోభింపజేస్తుంది" అని విమర్శించింది. "ఇప్పుడు మేం, మహారాష్ట్ర కంటే మంగోలియానే అదృష్టశాలి అని భావిస్తాం. ఎందుకంటే, దేశ ఆర్థిక సత్తాను చాటే విధంగా వారికి సాయం ప్రకటించారు కదా!" అని పేర్కొంది.

  • Loading...

More Telugu News