: కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కు అన్నెకరాలు కావాలా?: షబ్బీర్ అలీ


ఉస్మానియాలోని ఖాళీ భూముల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన పలు విమర్శలకు దారి తీస్తోంది. విశ్వవిద్యాలయానికి అన్నెకరాలు అవసరంలేదనడంపై పలువురు మండిపడుతున్నారు. తాజాగా టి.కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఇప్పుడాయన బేగంపేటలోని విశాలమైన భవంతిలో ఉంటున్నారని, అది కూడా చాలక ఐఎఎస్ ఆఫీసర్ల సంఘం భవన స్థలం కూడా తీసుకున్నారని ఆరోపించారు. అసలు ఇద్దరు ఉండే ఇంటికి పద్నాలుగు ఎకరాలు కావాలిగానీ, వేల మంది విద్యార్థులు చదువుకునే ఉస్మానియా యూనివర్శిటీకి మాత్రం స్థలం వద్దా? అని ప్రశ్నించారు. నిజాం నవాబు ఆరెకరాల స్థలంలో ఇల్లు ఏర్పాటు చేసుకుంటే, కేసీఆర్ మాత్రం పద్నాలుగు ఎకరాల నివాసంలో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. కేవలం జీహెచ్ ఎంసీ ఎన్నికల కోసమే ఈ కొత్త నాటకం మొదలుపెట్టారని షబ్బీర్ వ్యాఖ్యానించారు. అసలు తెలంగాణ భవన్ కోసం కబ్జాచేసిన 170 గజాల భూమిని పేదల ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News