: అందుకే జిమ్ కు వెళుతున్నా: అమితాబ్
నేటికీ సినిమాలే జీవితంగా ముందుకు వెళుతున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (72) సినిమాలో తన పాత్ర పోషణ పట్ల నిబద్ధత కనబరుస్తారు. ఇప్పుడు ఓ కొత్త ప్రాజెక్టు ఒప్పుకున్న అమితాబ్ తన శరీర రూపురేఖలు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకే రోజూ జిమ్ కు వెళుతున్నానని తన బ్లాగులో పేర్కొన్నారు. బాడీ షేప్ మార్చుకునేందుకు వర్కౌట్లు చేస్తున్నానని, వాటి ఫలితం మూడు నెలల తర్వాత కనిపిస్తుందని తెలిపారు. కొత్త సినిమాలో పాత్ర కోసమే జిమ్ కు వెళుతున్నానని, అనారోగ్యం కారణంగా కాదని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు.