: లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం ఢిల్లీని పాలించే యత్నం చేస్తోంది: కేజ్రీవాల్ ఆరోపణ


ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకం, బదిలీల విషయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య జగడం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం కాస్తా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దగ్గరకు వెళ్లడం, ఢిల్లీ సీఎస్ గా ఎల్జీ నియమించిన వ్యక్తికే ఆమోదం పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీని పాలించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన ఘాటు లేఖ రాశారు. రాజ్యాంగబద్ధంగా తమ ప్రభుత్వం స్వతంత్రంగా పనిచేసేలా అనుమతించాలని, తమ పనేదో తమను చేసుకోనివ్వాలని ప్రధానిని కోరారు.

  • Loading...

More Telugu News