: ఎర్రచందనం స్మగ్లర్లలో రాజకీయ నేతలున్నారు: ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప


సంచలనం రేపుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ స్కాంలో కొందరు రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి ఎన్ చినరాజప్ప ఈ ఉదయం వెల్లడించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో రాజకీయ నేతలున్నారని వ్యాఖ్యానించిన ఆయన, వారి పేర్లను మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. ఈ కేసులో ఎవరి ప్రమేయమున్నా వదిలిపెట్టబోమని, పోలీసులపై ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్కడి నుంచి మదనపల్లికి వెళ్లిన చినరాజప్ప గాలివానకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించారు. పంటలు కోల్పోయిన రైతులకు రెండు మూడు రోజుల్లో పరిహారం చెల్లిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News